Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భూస్వామ్య దోపిడీపై తిరగబడ్డ విప్లవ కెరటం చిట్యాల ఐలమ్మ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Sep 11,2022

భూస్వామ్య దోపిడీపై తిరగబడ్డ విప్లవ కెరటం చిట్యాల ఐలమ్మ

- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్‌
నవతెలంగాణ-ఖమ్మం
నిజాం రజాకార్లపై కరుడుగట్టిన భూస్వామ్య దోపిడీపై తిరగబడ్డ విప్లవ కెరటం చిట్యాల ఐలమ్మ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అన్నారు. తొలుత ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్‌ అధ్యక్షతన జరిగిన వీర తెలంగాణ విప్లవ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 37వ వర్థంతి సభలో ఆయన మాట్లాడుతూ నిజాం రాజ్యంలో జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాముల దోపిడీ అంతులేకుండా సాగిందన్నారు. రైతాంగాన్ని, చేతివృత్తుల వారిని కట్టు బానిసలుగా చేసి వెట్టి చాకిరీ చేయించటానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు. ఐలమ్మ పండించిన పంటను దౌర్జన్యంగా దేశ్‌ముఖ్‌ గూండాలు ఆక్రమించినప్పుడు కమ్యూనిస్టు కార్యకర్తలతో కలిసి ఐలమ్మ పోరాడి దక్కించుకుందన్నారు. ఈ చైతన్యంతో నిజాం రాజ్యాన్ని, ఫ్యూడలిజాన్ని నిర్మూలించేందుకు సాయుధ పోరాట యోధురాలుగా పోరాడిందన్నారు. ఐలమ్మ తన ఇంటినే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి పుచ్చలపల్లి సుందరయ్యతో జెండా ఆవిష్కరింపజేసి ప్రజా ఉద్యమాలను నిర్మించిందన్నారు. ఐలమ్మ పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తి కలిగించిందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్‌ మాట్లాడుతూ బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుండి 17 వరకు సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ వారోత్సవాలను జరిపి బిజెపి సాగిస్తున్న తప్పుడు విధానాలను ఎండగడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, నందిపాటి మనోహర్‌, ఆర్‌.ప్రకాష్‌, ఎం.గోపాల్‌రావు, జిల్లా నాయకులు ఎం.డి.గౌస్‌, బోడపట్ల సుదర్శన్‌, కత్తుల అమరావతి, మెరుగు రమణ, సత్తెనపల్లి శ్రీను పాల్గొన్నారు.
మధిర : పట్టణ రజక సంఘం అధ్యక్షుడు తలపుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఐలమ్మ వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగండ్ల వెంకటనర్సయ్య, మేడేపల్లి నాగేశ్వరరావు, జిల్లా రజకసంఘం అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మయ్య, వంగవీడు మాజీ సర్పంచ్‌ బండి వెంకటేశ్వర్లు, నిధానపురం మాజీ ఎంపీటీసీ అట్లూరి కృష్ణ, అంబారుపేట రజకసంఘం బాద్యులు అద్దంకి నాగరాజు, పట్టణ రజక సంఘం బాద్యులు బండి కాళేశ్వరరావు పాల్గొన్నారు.
సత్తుపల్లి : భూమి, భుక్తి, వెట్టిచెకిరీ విముక్తి కోసం పీడిత ప్రజలకు అండగా చాకలి ఐలమ్మ నిప్పు కణికలా మారారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లిలో ఐలమ్మ 37 వర్థంతిని ఎమ్మెల్యే సండ్ర జరిపారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడారు. ముసునూరు జమిందారుపై వీరోచిత పోరాటం నెరపి 10లక్షల మందికి భూములు పంచిన ధీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మెన్‌ కూసంపూడి మహేశ్‌, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, టోపీ శ్రీను, కౌన్సిలర్లు చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్‌, మందపాటి రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
బీసీ సంఘం ఆధ్వర్యంలో...
సత్తుపల్లి బీసీ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37 వర్థంతిని ఘనంగా జరిపారు. స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారాయణ వరపు శ్రీనివాస్‌, నాయకులు విరివాడ నాగభూషణం, తిన్నవల్లి రంగారావు, కొనసాకల శ్రీను పాల్గొన్నారు.
సత్తుపల్లిరూరల్‌ : మండలంలోని కాకర్లపల్లిలో ఐలమ్మ వర్థంతిని సీపీఐ(ఎం) గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్‌, శాఖ కార్యదర్శి వి. కుమారస్వామి పాల్గొన్నారు. గంగారంలో జరిగిన కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్‌ సర్పంచ్‌ మందపాటి శ్రీనివాసురావు, రజకసంఘం జిల్లా నాయుకులు నిమ్మటూరు రామకృష్ణ, కొనడపల్లి పాల్గుణ, కావేటి వెంకటేశ్వరావు, అప్పారావు, ఐద్వా మండల నాయకురాళ్ళు పుష్పవతి, సత్యవతి, లీల, ఎస్కె అబ్జాల్‌ తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి : తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ, విరోచిత పోరాటం నేటి తరానికి ఆదర్శమని రజక వత్తిదారుల సంఘం వైరా నియోజకవర్గ ఇంచార్జీ రేగళ్ల మంగయ్య కొనియాడారు. శనివారం చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని విశ్వనాధపల్లి లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వత్తి దారుల సంఘం నాయకులు రేగళ్ల మంగయ్య, కణతాల ఉపేందర్‌, దాసరి సైదులు, బెల్లంకొండ శీను, యాడారి వెంకన్న, బెల్లంకొండ సత్యం, అక్కునపల్లి వినరు, దాసరి యశోద, బెల్లంకొండ పద్మ, కణతాల సావిత్రి పాల్గొన్నారు.
వైరాటౌన్‌ : ఐలమ్మ వర్ధంతిని సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఐ (ఎం) వైరా నియోజకవర్గ కన్వీనర్‌ భుక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్‌, రూరల్‌ కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు బోడపట్ల రవీందర్‌, మల్లెంపాటి రామారావు, బొంతు సమత, గుడిమెట్ల రజిత, రాచబంటి భత్తిరన్న, అనుమోలు రామారావు, గుడిమెట్ల మోహన్‌ రావు, సంక్రాంతి నరసయ్య, పారుపల్లి శ్రీనాథ్‌, వడ్లమూడి మధు పాల్గొన్నారు.
ఖమ్మం : ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవన సంధ్య వృద్ధుల ఆశ్రమంలో అరటిపండ్లు, డబుల్‌ రొట్టెలను వృద్దులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు రేగళ్ల సీతారాములు, జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్‌ నరసింహా రావు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : ఐలమ్మ వర్ధంతిని పిండిప్రోలు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు పసలది ముత్తయ్య, ఎంపీటీసీ పులు గుజ్జు వెంకటేశ్వర్లు, తిరుమలాయపాలెం సొసైటీ వైస్‌ చైర్మన్‌ చామకూరి రాజు, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి పప్పుల ఉపేందర్‌, టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు పరికపల్లి చంద్రశేఖర్‌, గౌతమీ విద్యాసంస్థల అధినేత కంపాటి బాబురావు, గోకినేపల్లి సత్యం పాల్గొన్నారు
వేంసూరు : తెలంగాణ రజక సేవ సంఘం మండల అధ్యక్షుడు తాళ్లూరు రామారావు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఆడసర్లపాడులో నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్‌ కార్యదర్శులు పగిడిపల్లి రాము, వెదుళ్ళ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తల్లాడ: తల్లాడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఐలమ్మ వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శీలం పకీరమ్మ అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్‌, మండల కార్యదర్శి రామలింగేశ్వరరావు, శీలం సత్యనారాయణ రెడ్డి, నల్లమోతు మోహన్‌రావు, గుంటుపల్లి వెంకటయ్య, ఆదూరి జీవరత్నం, షేక్‌ నన్నేసాహెబ్‌, షేక్‌ మస్తాన్‌, పులి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : ఐలమ్మ వర్థంతిని వియం బంజరలో నిర్వహించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు పంతంగి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చలమల విఠల్‌రావు, నాయకులు గాయం తిరుపతిరావు, తడకమళ్ళ చిరంజీవి, ఎంపీటీసీ వంగా ఝాన్సీ నిరంజన్‌, మల్లెల శీను పాల్గొన్నారు.
తల్లాడ : అన్నారుగూడెంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముచ్చింతల నరసింహారావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల ఉప్పలయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పుల బుజ్జన్న మాట్లాడారు. అన్నారుగూడెంలో రజక సంఘం భవన నిర్మాణానికి 50 వేల రూపాయల నగదును మాచర్ల ఉప్పలయ్య ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మారెళ్ళ మమత, ఉపాధ్యక్షులు తాళ్లూరు దర్గాయ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు ఉపేందర్‌, రజక సంఘం నాయకులు తాళ్లూరి పులి రాములు, పావురాల కృష్ణయ్య, తాళ్లూరి రాములు, ముచ్చింతల చెన్నయ్య, తాళ్లూరి సాంబ తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : ఐలమ్మ స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సిపిఎం మండల నాయకులు ఏటుకూరి రామారావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రావెళ్ల భవనంలో సిపిఎం మండల కమిటీ, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ముఠాపురం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు పెద్దిరాజు నరసయ్య, ఐద్వా నాయకురాలు బెల్లం లక్ష్మి, సీపీఐ(ఎం) నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు, డేగల వెంకటేశ్వరరావు, సామల మల్లికార్జున్‌ రావు పాల్గొన్నారు.
వైరాటౌన్‌: ఐద్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్‌ నాయకులు చావా కళావతి, ఐద్వా వైరా పట్టణ అధ్యక్షురాలు మచ్చా మణి, కార్యదర్శి గుడిమెట్ల రజిత, నాయకురాలు భుక్యా విజయ, బత్తుల ప్రమీల, భందెల అమతమ్మ, తాటి కృష్ణకుమారి, దుద్దుకూరు వీరమ్మ, రాచబంటి విజయ, దుద్దుకూరి సీతారామమ్మ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం: మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో తెలంగాణ రజక సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సేవా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మారపు బ్రహ్మయ్య, ప్రచార కార్యదర్శి తలుపుల విజయబాబు, తెలంగాణ రజక సేవా సంఘం ఎర్రుపాలెం మండల అధ్యక్షులు కుడుపు గంటి ఉద్దం డు, రజక సేవా సంఘం మండల ఉపాధ్యక్షులు మల్లారపు బాలాజీ, సీనియర్‌ రజక సంఘం నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, దూదిగం పకీరయ్య పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మధిర మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చావా రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు పంబి సాం బశివరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి సేలం కవిత, స్థానిక సర్పంచ్‌ అప్పారావు పాల్గొన్నారు.
ముదిగొండ : చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతిని శనివారం సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం)మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, సిపిఐ(ఎం) మండల నాయకులు మందరపు వెంకన్న, పద్మావతి, బట్టు రాజు, మెట్టెల సతీష్‌, వేల్పుల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు : ఐలమ్మ వర్ధంతిని సందర్భంగా సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా ఆద్వర్యంలో నిర్వహించారు. సీపీఎం కార్యాలయంలో ఐద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, చెన్నూరు గ్రామంలో సీపీఎం మండల కమిటీ ఆద్వర్యంలో మాదల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు, చండ్రుపట్లలో గొర్రెల మేకలు సంఘం మండల కార్యదర్శి భట్టు నరసింహారావు ఆద్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చండ్రుపట్ల గ్రామసర్పంచి గోల్లమందల ప్రసాద్‌, సీపీఎం మండల కమిటీ సభ్యులు మనుమంటి వెంకటి, రామనాధం పాల్గొన్నారు.
బోనకల్‌ : ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, కందికొండ శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం కోరారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల సిపిఎం కార్యాలయంలో, చిరునోముల గ్రామపంచాయతీ కార్యాలయము వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ ఎం నాయకులు నిమ్మల రామారావు, ముంగి వెంకన్న, గొల్ల కోటేశ్వరరావు, నిమ్మ తోట మోహన్‌ రావు, నీలకంఠం రాము, పిల్లలమర్రి వెంకట అప్పారావు, పిల్లలుమర్రి వెంకటేశ్వర్లు, పిల్లలమర్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.