Authorization
Tue May 06, 2025 07:02:30 am
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన తెలం గాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులను ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపి వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఎస్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, సత్తుపల్లి ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య, ఎంఎల్సీ తాతా మధు, సుడా చైర్మన్ విజయకుమార్, నగర మేయర్ నీరజ అదనపు కలెక్టర్లు మాధుసుదన్ రావు ,రాధిక , అడిషనల్ కలెక్టర్ మొగిలీ పాల్గొన్నారు.