Authorization
Tue May 06, 2025 10:38:58 pm
నవతెలంగాణ-భద్రాచలం
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరగనున్నాయని అట్టి మహాసభల సందర్భంగా అక్టోబర్14న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభలో సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో పట్టణ నాయకులు బత్తుల నర్సింహులు అధ్యక్షతన పట్టణ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆకోజు సునిల్ కుమార్, పట్టణ కార్యవర్గ సభ్యులు బల్లా సాయి కుమార్, మారెడ్డి శివాజీ, విశ్వనాద్, హిమాం ఖాసీం, రమేష్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : వచ్చే నెల 14 నుంచి 18 వరకు విజయవా డలో జరిగే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర నాయకులు రావులపల్లి రాం ప్రసాద్ అన్నారు. మండలంలోని సారపాక కపర్తి భవన్లో సోమవారం మండల సీపీఐ కౌన్సిల్ సమావేశం అలవాల సీతారా మరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా సమితిసభ్యులు శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు, సీనియర్ నాయకులు నాగేశ్వరావు, మండల సహాయ కార్యదర్శిలు బిక్షం తదితరులు పాల్గొన్నారు.