Authorization
Wed May 07, 2025 09:42:12 am
ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడిలో శ్రీదేవి శ్రీ నవరాత్రి బ్రహ్మౌత్సవములు ఉత్సవం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దంపతులచే కలశ స్థాపన పూజతో ఉత్సవాలు ప్రారంభించారు. సోమవారం నుండి అక్టోబర్ 6 వరకు జరగనున్నాయి. తొలి రోజు ఉత్సవాల సందర్భంగా 21 మంది వృశ్చికలచే ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి కే.సులోచన దంపతులు దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ మహిపతి రామలింగం, ధర్మకర్తలు చింత నాగరాజు గంధం వెంగళరావు, బండి చిన్న వెంకటేశ్వర్లు, సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, కాటారపు లక్ష్మీనారాయణ, ఎస్వీఆర్కే ఆచార్యులు బేతంచెట్టి విజరు కుమార్, శ్రీ కిల్లర్ నాగమల్లేశ్వరరావు, ఆడేపు చిన్న వెంకట రమణయ్య, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పిటిసి బరపాటి వాసుదేవరావు, సర్పంచ్ అనిత, భక్తులు పాల్గొన్నారు.