Authorization
Tue May 06, 2025 06:39:39 am
- డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుక
నవతెలంగాణ-భద్రాచలం
భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాద సామ్రాజవాద శక్తులకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వల్లపు ప్రేమ్ కుమార్, దారిశెట్టి సతీష్‌లు పిలుపునిచ్చారు. మంగళవారం భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు డీవైఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పాత మార్కెట్ సెంటర్లో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్, సతీష్ బాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చితిరాల దుర్గ రేగ హరీష్, రాయల అజరు, కుర్రి కళ్యాణ్, కుందూరి షేక్ రియాజ్, పింగిలి దుర్గ, సందీప్, రాజమండ్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు.