Authorization
Tue May 06, 2025 09:10:00 am
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణానికి చెందినటువంటి సుభాష్ నగర్ కాలనీ, చికెన్ మార్కెట్ స్థానికుల సమస్యలను టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, స్థానికులు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానికుల ఆకాంక్ష కనుగుణంగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, రత్నం రమాకాంత్, రాంబాబు, రాజీవ్, నాగేందర్, స్థానిక మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.