Authorization
Tue May 06, 2025 08:12:04 am
- టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు రామచంద్రరావు
నవతెలంగాణ-అశ్వాపురం
పినపాక నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కఠోర దీక్షతో కృషి చేయాలని ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంటరీ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ ఎదుగుదలకు సభ్యత్వ నమోదు ఎన్నుముకగా ఉంటుందన్నారు. పార్టీ సభ్యులందరికి తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు చేరువుగా నిలిచిందన్నారు. అనంతరం సమన్వయ కమిటీ సభ్యులను ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అజ్మీర రాజు నాయక్ రామేశ్వరరావు, రవీంద్ర చారి, పోటు రంగారావు వట్టం నారాయణ, తుళ్లూరి ప్రకాష్ రావు, కనకమెడల హరిప్రసాద్, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.