Authorization
Wed May 07, 2025 05:16:43 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ శ్రీ విజయ శంకర స్వామి డిమాండ్ చేశారు. జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి సంయుక్త అధ్వర్యంలో చేపట్టిన అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర గురువారం సాయంత్రం నేలకొండపల్లి గ్రామంలోని శ్రీ భక్త రామదాసు దేవాలయాన్ని చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు, అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ విజయ శంకర స్వామికి ఘనంగా స్వాగతం పలికారు.