Authorization
Wed May 07, 2025 05:48:54 pm
- సర్వేకు అడ్డుపడుతున్న అటవీ అధికారుల తీరు మార్చుకోవాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
పోడు భూముల సర్వేను పూర్తిచేసి, తక్షణమే హక్కుపత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని మాధారంలో పోడు భూములను సందర్శించి పోడుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం సాగులో ఉన్న పోడు భూములన్నింటినీ సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చినా స్థానిక అటవీశాఖ అధికారులు మాత్రం పోడు భూముల సర్వేకు ఏవేవో కుంటిసాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అటవీ అధికారులు గత రెండేళ్ల క్రితం కరోనా సమయంలో సాగుకు దూరంగా ఉన్నప్పుడు సాగుదారుల భూముల్లో అటవీ అధికారులు ఆక్రమంగా మొక్కలు నాటారని, పేదల నుంచి భూములు గుంజుకోవాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు డిష్ రాంబాబు, చనగాని వినోదక్కుమార్, సిద్ధిని రమణ, భూరం నాగబాబు, సత్తయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.