Authorization
Wed May 07, 2025 02:43:53 pm
- సంఘం అధ్యక్షులు బొడ్డు ఏసుబాబు
నవతెలంగాణ-పినపాక
మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మున్నూరు కాపు సంయుక్త సంక్షేమ సంఘం పినపాక, కరకగూడెం మండలాల అధ్యక్షుడు బొడ్డు యేసుబాబు అన్నారు. మంగళవారం పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో పినపాక, కరకగూడెం మున్నూరుకాపు సంయుక్త మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు, ప్రధాన కార్యదర్శి తోట వెంకటేశ్వర్లు, ధూళిపూడి శివప్రసాద్ మండల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో దుగినేపల్లి గ్రామ కమిటి ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లో ప్రత్యేక పాత్ర పోషించాలన్నారు. గ్రామ అధ్యక్ష, కార్యదర్శితో సహా 24 మందితో గ్రామ కమిటీ నియమించారు. దుగినేపల్లి మున్నూరుకాపు నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడుగా శనగల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా శనగల చిన్న సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా ఎలగాల మల్లయ్య, వాకా సాంబ, ప్రధాన కార్యదర్శి మద్ధంశెట్టి సుబ్బారావు, కోశాధికారిగా సుంకరి రమణయ్య, సహాయ కార్యదర్శులుగా అట్ల శ్రీనివాస్, వాక వీర్రాఘవులు, కార్యదర్శిగా శనగల వీర్రాజు, రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా తదితరులను ఎన్నుకున్నారు.