Authorization
Tue May 06, 2025 01:04:29 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16, 17 తేదీల్లో భద్రాచల పట్టణంలో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా 16వ తేదీన బహిరంగ సభ ఉదయం 10 గంటలకు ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ ఈ మహాసభలలో పాల్గొనాలని ఆయన కోరారు. మండలంలో ప్రజా సంఘాల కార్మికులందరూ పాల్గొనాలని, భవనిర్మాణ కార్మికులు, అంగన్వాడి, ఆశా వర్కర్లు, మధ్యాహ్నం భోజనం వర్కర్లు, ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, గ్రామ దీపికలు, ప్లాంటేషన్ కార్మికులు, ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఇతర ప్రజా సంఘాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యాకోబు, సురేష్, చారి, కోడు యాకోబు, పద్మ, రోశమ్మ, వెంకటమ్మ, బత్తుల నాగే శ్వరావు, పూరెల్ల ధమంతి, రాధా, నాగ మణి, లక్ష్మి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.