Authorization
Tue May 06, 2025 07:16:29 pm
- ప్రతి ఇంట వెలుగులు ఉన్ననాడే నిజమైన సంక్రాంతి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పేదలందరికీ ఆకలి లేని రోజులు వచ్చినప్పుడే నిజమైన పండగని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. హనుమాన్ బస్తి సీపీఐ(ఎం) శాఖ ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కనకయ్య మాట్లాడుతూ ప్రతి పేదవాడికి జానెడు జాగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చేయడానికి పని ఉన్నప్పుడే అసలైన పండుగని ఆయన అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రజల స్థితిగతులు మారట్లేదని ఆయన పేర్కొన్నారు. అందరూ సంతోషంగా ఉండే సమాజం కోసం కుల మతాలకు అతీతంగా కొనసాగేలా ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఆలో చించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, నాయకులుి సందకూరి లక్ష్మి, ఎన్ఎస్.రాజు, రమాదేవి, జయలక్ష్మి, గుగులొథ్ రాజేష్, సునీల్, గణేష్, రాజారాం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.