Authorization
Wed May 07, 2025 02:34:35 am
- రాబోయె తరాలకు గుర్తుండేలా చేయాలి
- అబ్బుర పరిచిన సురభి నాటకాలు
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
అధునిక టెక్నాజీలో అంతరించి పోతున్న నాటక రంగాన్ని బతికేంచేందుకు బతుకుతున్న సురభి కళాకారులకు చేయూత ఎంతో అవసరమని, ఈ పౌరాణిక, జానపద, నాటక రంగాన్ని రాబోయె తరాలకు గుర్తుండేలా చేయాలని, కొత్తగూడెంలో గత వారం రోజులుగా నిర్వహించి సురభి నాటకాలు జిల్లా ప్రజలను అబ్బుర పరిచాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లోనాటకాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. సురభి కళాకారులు అద్బుత నాటక ప్రదర్శనతో ప్రజలను ఆకట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. మొదటి రోజు, చివరి రోజు మాయాబజార్ నాటికను కలెక్టర్ ఆసాంతం తిలకించారు. నాటక రంగాన్ని బతికించడానికి సురఖి కళాకారులు కంకణం కట్టుకుని ప్రదర్శనలు ఇస్తున్న తీరు అభినందనీయమన్నారు. పద్యాలు, పాటలు, నటన ఏకకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రదర్శన చేయడం ఎంతో కష్టంతో కూడికున్నదని చెప్పారు. వారం రోజుల పాటు సురభి కళాకారులు మాయాబజార్, శ్రీనివాస కళ్యాణం, పాతాళ భైరవి, భక్త ప్రహ్లాద, బాలనాగమ్మ, లవకుశ వంటి అద్భుతమైన పౌరాణిక, జానపద నాటక కళా ప్రదర్శనలతో కొత్తగూడెం పట్టణ ప్రజలను మంత్ర ముగ్దులను చేశారని కితాబిచ్చారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఈ రోజుల్లో అలనాటి ఘట్టాల ను ఎంతో అద్భుతమైన సెట్టింగులతో, మాయ జలంతో ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించి, అలరించే విధంగా నటించా రన్నారు. ఇటువంటి కళలను బతికిం చడం ఒక చాలెంజ్ అని, ప్రజలు ఈ నాటికలను వీక్షించి ఎంతో ఎంజారు చేశారని చెప్పారు. ఇటువంటి నాటికలతో కళలను ఇంకా బతికించేందుకు వీరు చేస్తున్న కృషిని కలెక్టర్ అభినం దించారు. సురభి కళాకారులను ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శీలం శ్రీనివాస రావు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, పాల్వంచ తహసీల్దార్ రంగ ప్రసాద్, సురభి నాటిక సమాజ నిర్వహకులు, కళాకారులు వేణుగోపాలరావు పాల్గొన్నారు.