Authorization
Wed May 07, 2025 06:15:28 am
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
సమాజ మార్పునకు కృషి చేసిన మహనీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి పోరాట స్ఫూర్తితో సమస్యలపై ఉద్యమించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్ యువతకు పిలుపునిచ్చారు. స్థానిక వరంగల్ క్రాస్ రోడ్లోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో (భారత ప్రజాతంత్ర యువజన సంఘం)ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ 2023 క్యాలెండర్ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పొన్నం మురళి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న షేక్ బషీరుద్దీన్ మాట్లాడారు. ఎందరో మహనీయులు ఈ దేశం కోసం, సమాజం కోసం అనేక త్యాగాలు చేయటం వలన ఇప్పుడు పౌరులందరు స్వేచ్ఛా, స్వతంత్రాలతో జీవనం సాగిస్తున్నామన్నారు. డివైఎఫ్ఐ గత తొమ్మిది సంవత్సరాలుగా మహనీయులు, స్వతంత్ర సమరయోధులు, విప్లవకారులు, సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, మేధావుల చిత్రపటాలతోని క్యాలెండర్ వేయడం జరుగు తుందన్నారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో డివైఎఫ్ఐ ఖమ్మం రూరల్ అధ్యక్షులు జక్కంపూడి కృష్ణ, మండల కమిటీ సభ్యులు ఊరడి విజరు, పొన్నెకంటి అనీష్, గడ్డం సిద్దు, తాటి వెంకటేశ్వర్లు, తోట నరేష్ రెడ్డి, వట్టికోట నరేష్, చాంద్ పాషా, శభాష్ రెడ్డి, గురవయ్య, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.