Authorization
Mon May 05, 2025 10:45:35 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
జిల్లా జ్యూడిషల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అడక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు పనిచేసిన జ్యూడిషల్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌ని విభజించి భద్రాద్రి జిల్లా నూతన అసోసియేషన్ ఏర్పాటుచేశారు.
నూతన కమిటీ వీరే : కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా రామిశెట్టి రమేష్, డి.కొండ రవికుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నిర్మల మల్లికార్జున్, ట్రెజరర్‌గా లగడపాటి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీరంగం రామకృష్ణ, మహిళా ప్రతినిధిగా జి.ప్రమీల తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు రామ్ శెట్టి రమేష్, డికొండ రవి కుమార్‌లు మాట్లాడుతూ జ్యూడిషల్ ఎంప్లాయిస్‌లో నెలకొన్న సమస్యల సాధనకోసం మా మీద ఉంచిన ఈ బాధ్యతను పదవిగా, భావించకుండా నిరంతరం సమస్యల సాధన కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కమిటీ ఎన్నికలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగులందరూ పాల్గొన్నారు.