Authorization
Tue May 06, 2025 01:38:17 am
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్, కోటకట్ట, ఏరియా నందు సుమారు రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ, డ్రైయిన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు. పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృఢ సంకల్పంతో పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది అన్నారు.