Authorization
Sun April 27, 2025 07:57:09 am
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామ మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు తండ్రీ కాటమనేని నాగయ్య (85) అకాల మరణం చెందగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గురువారం నాగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కాటమనేని వెంకటేశ్వరరావు ఓదార్చారు. అదే విధంగా వల్లభనేని శ్రీనివాసరావు, నేరెళ్లలక్ష్మణరావు చిత్రపటాలకు పూలమాలలు వేసిన నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పరామర్శించిన వారిలో గ్రామ సర్పంచ్ గొల్లమందల ప్రసాద్, జడ్పిటిసి కట్ట అజరు కుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, రైతు సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వల్లపునేని శ్రీనివాసరావు ఉన్నారు.