Authorization
Fri April 25, 2025 02:23:56 pm
నవతెలంగాణ-మణుగూరు
అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ చేస్తున్న పోరాటాలకు మద్దతివ్వాలని కోరుతూ కలిసి 14 సమస్యలతో కూడిన వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి అరుణ, బూర్గంపహాడ్ ప్రాజెక్ట్ అధ్యక్షులు కొమరం అరుణశ్రీ, నాయకులు నరుకుల్ల హంసవేణి, అకిటి శైలజ, కావటి మంగతాయారు, మన్నెం సుధా పాల్గొన్నారు.