Authorization
Fri April 11, 2025 07:46:58 pm
- రెడ్ బుక్ డే అధ్యయనంలో సీపీఐ(ఎం)
నవతెలంగాణ-ఇల్లందు
సమస్యల సాధన, సంఘ చైతన్యం కోసం అధ్యయనం అవసరమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అబ్దుల్ నబీ అన్నారు. రెడ్ బుక్ డే సందర్భంగా మంగళవారం భగత్ సింగ్ చరిత్ర అధ్యయననంలో పాల్గొన్నారు. రెడ్ బుక్ డే సందర్భంగా మండల కమిటీ అధ్వర్యంలో ఏలూరి భవన్లో జరిగిన సభలో అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో మార్క్సిజం అధ్యయనం అత్యంత కీలకమని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ సోషలిజం పుస్తకాలు అధ్యయనం చేసి స్వాతంత్ర సంగ్రామం నడిపారాని అన్నారు. మన్యం మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో తాళ్లూరి కృష్ణ, దారవత్ రాందాస్, అబ్బాస్, మునీగంటి లక్ష్మీ, విజయ, వైకుంఠం, జయా, కాంతి, హుస్సేన్, కాంతి, శ్రీను, సంతోష, ఖైరున్, సాయిలు, వెంకన్న, ఈసం భద్రమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.