Authorization
Fri April 11, 2025 08:53:16 pm
- మూఢ విశ్వాసాలను సవాలు చేయాలి
నవతెలంగాణ-వైరాటౌన్
అభ్యుదయం కోసం ప్రతి వ్యక్తి మూఢ విశ్వాసాలను సవాలు చేయాలని వైరా మాజీ ఎంపిపి బొంతు సమత అన్నారు. శుక్రవారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో వైరా స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జాతీయోద్యమంలో భగత్ సింగ్ కృషి, జీవితం, త్యాగం పైన విస్తృత అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా సమత భగత్ సింగ్ వీలునామా పైన పారుపల్లి కృష్ణారావు, నారికొండ అమరేందర్, భగత్ సింగ్ జీవిత చరిత్రపైన సుంకర సుధాకర్, బోడపట్ల రవీందర్ జాతీయ విప్లవ భగత్ సింగ్ అవగాహన పైన వివరించారు. ఈ సందర్భంగా బొంతు సమత మాట్లాడుతూ వాస్తవిక దృష్టితో పరిశీలించి సమాజ అభివృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలను సవాలు చేయాలని అన్నారు. భారత సమాజంలో సనాతన ధర్మం పేరుతో సాగిన అణిచివేత సామాజిక వెనుకబాటుకు కారణం అన్నారు. కొన్ని సమూహలను ఉత్పత్తి ప్రక్రియకు దూరంగా ఉంచి ఆర్థిక వ్యత్యాసాలను మూలం అయిందని అన్నారు. భారత దేశం అభివృద్ధికి సరళీకరణ ఆర్థిక విధానాలు తోపాటు, సనాతన సంప్రదాయం ఆటంకం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, సీనీయర్ నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, మందడపు రామారావు, అనుమోలు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, వడ్లమూడి మధు, తోట కృష్ణవేణి, కురుగుంట్ల శ్రీనివాసరావు, దేవభక్తిని నరిసింహరావు తదితరులు పాల్గొన్నారు.