Authorization
Fri April 11, 2025 09:16:09 pm
- ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడం అమానుషమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. గురువారం మండలంలోని సారపాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాలుగా వ్యవహరించటం తగదని ఆయన పేర్కొన్నారు. దాడికి, ప్రతిదాడి చేయడం కంటే ప్రజాస్వామ్య విలువలే మాకు ప్రాధాన్యమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా ఆయా నియో జకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే, నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు తాళ్ళూరి చక్రవర్తి, బట్టా విజరు గాంధీ, ఐఎన్టీయూసీ రాష్ట్ర విభాగ నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి, కణితి కృష్ణ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, వాసుదేవ రావు, తదితరులు పాల్గొన్నారు.