Authorization
Fri April 11, 2025 08:33:50 pm
నవతెలంగాణ-సుజాతనగర్
మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సందర్శించి మాట్లాడుతూ కంటి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బందితోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.