Authorization
Fri April 11, 2025 04:40:31 am
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం ప్రభుత్వ వైద్యశాల పక్కనే గల క్రీడా మైదానంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన సివిల్ ఇంజనీర్ కొర్సా వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయంతో నిర్వహి స్తున్న మండల స్థాయి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్ మంగళవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. శ్రీనగర్ కాలనీ, బి కొత్తూరు గ్రామాల టీమ్‌లు తలపడగా శ్రీనగర్ కాలనీ టీమ్ విన్నర్‌గా నిలిచింది. ఈ ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఆటగాడు మ్యాన్ అప్‌ది మ్యాచ్ షీల్డును రెవెన్యూ సిబ్బంది అందజేశారు. కాటాయిగూడెం, జిన్నెల గూడెం జట్లు తలపడగా కాటాయిగూడెం టీమ్ విజయం సాదించింది. ఈ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచిన క్రీడాకారుడు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కించు కున్నాడు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి డివిజన్ అద్యక్షులు సోంది మల్లూరు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చంటి, వీఆర్ఏల మండల అధ్యక్షులు కోట్ల గణేష్, రాజేష్, జయబాబు, హేమంత్, రాధ తదితరులు పాల్గొన్నారు.