Authorization
Tue April 08, 2025 01:30:11 am
పాల్వంచ : ఐకేపీ వీఓఏల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని కోరారు. సమస్యను పరిష్కరించాలని ఐకేపీ వీఓఏల చేస్తున్న నిరసన సమ్మెకు మద్దతు సంఘీ భావం తెలిపారు. మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వి.అనురాధ, కార్యదర్శి యన్.రమేష్, కోశాధికారి రమాదేవి, ఉమామహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం వీఓఏలను సెర్ఫ్ ఉగ్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని పలు డిమాండ్లతో సీఐటీయూ అనుబంద వీఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మెను ఉద్దేశించి సంఘం మండల అద్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మే 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు తల పెట్టిన వంటా వార్పు కార్యక్రమంలో వీఓఏలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునాచ్చరు. ఈ కార్యక్రమంలో విఓఏలు కృష్ణవేణి, రమాదేవి, లత, రేఖ, నరేంద్ర, పద్మ, నాగరాజు, రామకృష్ణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్ : కొత్తగూడెంలో వీవోఏ దీక్షలు 7వ రోజు చేరుకున్నాయి. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న సంఘీభావం తెలిపార. ఈ కార్యక్రమంలో నాయకులు రేష్మ, మాధవి, స్వరూప, అరుణ, రాజమణి, సత్యవతి, పద్మ, రజిత, జహేద, సఫియా, రమణ తదితరులు పాల్గొన్నారు.