Authorization
Thu April 03, 2025 04:22:45 pm
- జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-చింతకాని
రైతుల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మంగళవారం చింతకాని మండలం నాగులవంచ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలు ఆరు కాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు విషయంలో ఎలాంటి కష్టాలకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలబడి గిట్టుబాటు ధర కల్పించి పంట కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షులు నల్లమోతు శేషగిరి, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంకాయలపాటి లచ్చయ్య, ఎంపిపీ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.