Authorization
Mon May 05, 2025 01:57:14 am
- 26వ రోజు నిరవధిక సమ్మె శిబిరాన్ని ప్రారంభించిన ఐకేపీ, వీఓఏల జిల్లా కార్యదర్శి అరుణ
నవతెలంగాణ-ఇల్లందు
దశాబ్దాలుగా పనిచేస్తున్న ఐకేపీ, వీఓఏలకు కనీస వేతనం ఇవ్వాలని జిల్లా కార్యదర్శి అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 26 రోజులుగా నిరవదిక సమ్మె శిబిరాన్ని సంఘం జిల్లా కార్యదర్శి అరుణ, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీను గోపాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ వీవోఏలు గత 23 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీస వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేస్తున్నదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజా ఉద్యమానికి సన్నద్ధం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అబ్ధుల్ నబి, తాళ్లూరి కృష్ణ, వీఓఏల మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నవ్య, పాపారావు, వసంతరావు, సుల్తానా, ప్రమీల, అరుణ, టేకులపల్లి మండలం నాయకులు దాసరి చంద్రకళ, సురేష్, పృధ్వీ, గోపి, భూలక్ష్మి, రాజేశ్వరి, శిరీష తదితరులు పాల్గొన్నారు.