Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
- మైసిగండిలో కాంగ్రెస్ నేతల సంబురాలు
- బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిన నేతలు
నవతెలంగాణ-ఆమనగల్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కర్నాటక రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా ఆదివారం కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల్లో ఆలోచన మార్పు వచ్చిందని అన్నారు. అదేవిధంగా గత 9 సంవత్సరాలుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసుగు చెందారని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జవాహర్ లాల్ నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హీరాసింగ్ నాయక్, నాయకులు రాజు నాయక్, తులసి రామ్ నాయక్, భోని శంకర్, రమేష్, సికిందర్, సుమన్, విజరు, గుండ్య, బాషా, సకృ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.