Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన భూమన్న గారి సాయి రెడ్డిని వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, పుడూర్ మండల పిఎసిఎస్ చైర్మన్ పట్లోల్లో సతీష్ రెడ్డి ఆదివారం నియమించారు. ఈ సందర్భంగా నియామకపత్రం అందజేశారు. అనంతరం భూమన్న గారి సాయి రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి మాట్లాడుతూ యువకులను చైతన్య పరచాలని, యువజన కాంగ్రెస్‌ను పటిష్టం చేయడానికి కృషి చేయాలని సూచించారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి కల్పనలో విఫలమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి భూమన్న గారి సాయి రెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని అందజేసినందుకు రామ్మోహన్‌రెడ్డికి, సతీష్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తానని చెప్పి యువతను మభ్యపెట్టారన్నారు. నేటికీ ఎంతోమంది చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాక రోడ్డున పడ్డారని తెలిపారు. నిరు ద్యోగ యువత కోసం పోరాటం చేస్తామన్నామన్నారు. కాంగ్రెస్ పటిష్టం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూమన్నగారి పరశురాంరెడ్డి, పరిగి టౌన్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణరెడ్డి, జగన్, అన్వర్, రాఘవేందర్ రెడ్డి, విద్యాదర్ రెడ్డి, బస్వరాజు, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.