Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకర్పల్లి ఎంపీడీవో, క్రీడా కన్వీనర్ వెంకయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే సీఎం కప్ క్రీడా పోటీలకు ఎంపిక చేసిన క్రీడా మైదానాలు ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని శంకర్పల్లి ఎంపీడీవో, క్రీడా కన్వీనర్ వెంకయ్య అన్నారు. ఆదివారం మండల పరిధి లోని మోకిల రైతు వేదిక వద్ద క్రీడా మైదానాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోకిలా సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు విట్టల్, ఉపాధ్యాయులు ఆశీర్వాదం తదితరులతో కలసి పరిశీలించడం జరిగిందని తెలిపారు. మండల స్థాయిలో గెలిచిన క్రీడాకారులను సరూర్ నగర్ స్టేడియంలో జిల్లా స్థాయిలో 22వ తేదీన ఆడించడం జరుగుతుందని తెలిపారు. అలాంటి క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు మండల స్థాయి నుంచి వీడియో కార్యాలయం నుంచి సర్టిఫికెట్ తీసుకొని వెళ్లాలని సూచించారు ఈ క్రీడలకు మండలంలోని అన్ని గ్రామాల నుండి 15 నుంచి 36 సంవత్సరాల లోపు స్త్రీలు, పురుషులు పాల్గొనాలని సూచించారు. ఇందులో క్రీడలు అట్లాటిక్స్ స్త్రీలు పురు షులు, ఫుట్ బాల్,పురుషులు మాత్రమే, ఖోఖో స్త్రీలు, పురుషులు. వాలీబాల్, కబడ్డీ స్త్రీలు, పురుషులకు ఉంటా యని తెలిపారు. పై క్రీడలకు సంబంధించి మండల స్థార యి కమిటీ చైర్మన్‌గా ఎంపీపీ, జడ్పీటీసీ మెంబెర్‌గా, కన్వీ నర్గా ఎంపీడీిఓ, సభ్యులుగా తహసీల్దార్, సిఐ, ఎంఈఓ, ఎంసి, పిడిఎస్లు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ క్రీడల కు ఇన్చార్జులుగా పాప గారి ఆశీర్వాదం, నరసిం హులు ఉంటారని తెలిపారు. మండల స్థాయి క్రీడలు నిర్వహిం చాల్సిన స్థలం మండలంలోని మోకిలలోని రైతు వేదిక వద్ద క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తలిపారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్, మోడల్స్ ఇచ్చి జిల్లా స్థాయికి పంపబడతారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు సంప్రదించాల్సిన వివరాలు పి. ఆశీర్వాదం 9848416355, టైపిస్టు నర్సింలు 8142744676 నంబర్లకు సంప్రదించాలని కోరారు.