Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 15,2023

తెలుగు నాటక విద్యాలయం అవశ్యం

          మన తెలుగు నాటకం వికాసానికి మూడు ప్రధాన స్రవంతులు దోహదపడ్డాయని పరిశోథకులు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ తెలిపారు. 20వ శతాబ్దం ప్రధానంగా పద్య నాటకానిదే అని డా||సి.నారాయణరెడ్డి పేర్కొన్నా, ఆ శతాబ్దంలో ఈ మూడు ప్రధాన స్రవంతులు ప్రవేశించడం గమనార్హం.
బళ్ళారి రాఘవ లండన్‌ వెళ్ళి బెర్నార్డ్‌షా వంటి ప్రముఖుల ఎదుట షేక్స్‌ఫియర్‌ నాటకాలు ప్రదర్శించి ప్రశంసలు చూరగొని, అక్కడి నాటకాలను నిశితంగా పరిశీలించిన మీదట మన తెలుగు నాటక అభివృద్ధికి మూడు ముఖ్య సూచనలు చేశాడు.
1. నాటకాల్లో స్త్రీల పాత్రలు స్త్రీలే ధరించాలి. అప్పటి వరకూ నాటకాల్లో మహిళల పాత్రలను పురుషులే ధరించారు. పద్మశ్రీ స్థానం నరసింహారావు, రేబాల రమణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రిలు స్త్రీల పాత్రలకు ప్రతీతి అనే విషయం చెప్పక్కర్లేదు కదా. సాంఘిక నాటకాల్లో స్త్రీ పాత్రలేని నాటిక, నాటకాలు వందల సంఖ్యలో ముద్రితమైనాయి. వేల సంఖ్యల్లో దశాబ్దాల కాలం ప్రదర్శితమైనాయి. నాటకాల్లో విభిన్న పాత్రలు ధరించే స్త్రీలను ఇప్పటికీ చులకనగా చూసే గ్రామాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ ఫ్యూడల్‌ అవశేషాలు ఇంకా పోలేదు మరి.
2. పౌరాణిక, పద్య నాటకాల కన్నా సాంఘిక నాటకాలు మిన్న అని ఆంధ్ర నాటక కళాపరిషత్‌ వేదికపై ఢంకా భజాయించారు రాఘవ. అప్పటి నుండి సామాజిక చైతన్యం ఇతివృత్తం కలిగిన సాంఘిక నాటికలు, నాటకాలు ఔత్సాహిక కళాకారులకు ఇతివృత్తాలయ్యాయి. వృత్తినాటకం కన్నా ఔత్సాహిక నాటకం పెద్ద ఎత్తున విస్తరించడానికి ఈ పరిషత్‌ పోటీ దోహద పడింది.
3. వివిధ రంగాలకు ఎలా విద్యాలయాలు, శిక్షణాలయాలు వుంటాయో, అలానే నాటక రంగానికి విద్యాలయాలు, శిక్షణాలయాలు వుండటం అవశ్యం అని తెలిపారు. ఆ క్రమంలో తొలుత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాటక శిక్షణా విభాగం (థియేటర్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌) ఏర్పడింది. అనంతరం ఇప్పుడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో, తెలుగు విశ్వవిద్యాలయంలో, నిజాం కాలేజీలో థియేటర్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఏర్పడి విద్యార్థులకు శిక్షణనిస్తున్నాయి.
ఆంధ్రనాటక కళాపరిషత్‌, నట శిక్షణా విభాగంతో తెలుగు నాటక వికాసానికి మూడవ స్రవంతిగా దోహద పడింది ఆంధ్ర ప్రజానాట్యమండలి అని శర్మగారు వివరించారు.
నాటక రంగ వికాసానికి బళ్ళారి రాఘవ ప్రతిపాదించిన మూడు సూత్రాలను ఆచరణలో పెట్టడానికి త్రికరణశుద్దిగా పని చేసింది ప్రజానాట్యమండలి.
స్త్రీ పాత్రలు స్త్రీలు ధరించేలా దీక్ష వహించింది. కమ్యూనిస్టు కార్యకర్తల కుటుంబ స్త్రీలు రంగంలోకి దిగి 'మా భూమి, ముందడుగు' వంటి నాటకాలను రక్తి కట్టించారు. ఆ నాటక ఇతివృత్తాలు కూడా ప్రజా పోరాటాలకు సంబంధించినవి గనుక, పోరాట చైతన్యంలో భాగంగానే ఆ స్త్రీలు అలా రంగ ప్రవేశం చేశారు. నాటకరంగం లోని స్త్రీలకు అలా గౌరవమూ, ఆదరణ లభించడానికి కారకురాలయింది ప్రజానాట్యమండలి.
ప్రజానాటకాలు ఎలా రూపొందించుకోవాలనే సంకల్పంలో డా||గరికపాటి రాజారావు, కోడూరి అచ్చయ్య వంటి వారి దిగ్గజాలతో ప్రజానాట్యమండలి వర్క్‌షాప్‌లు, శిక్షణా శిబిరాలు నడిచేవి. అందుకే శర్మగారు 1980 దశకంలో ఓ సారి ఇలా అన్నారు... ''తెలుగు నాటక రంగంలో ఇప్పుడు వస్తున్న ప్రయోగాలన్నీ 40 ఏళ్ళ క్రిందటే రాజారావులు, అచ్చయ్యలు చేశార''ని. వారి సామాజిక దూరదృష్టి, ప్రయోగ వ్యామోహం అలా వుండేది మరి.
అప్పటి నుండి ఇప్పటికీ ప్రజాకళాకారులు, ప్రజానాట్యమండలిలు ఎన్నిగా చీలిపోయినప్పటికీ నాటక వర్క్‌షాప్‌లు, శిక్షణలు మరువడం లేదు. రాజకీయ, సామాజిక పరిస్థితులు డిమాండ్‌ చేసినప్పుడల్లా వారు ఆ శిక్షణల్లో రాటు దేలుతూ ప్రజల ముందుకొస్తూనే వున్నారు. సద్దార్‌ హష్మీ రూపొందించిన ఆధునిక వీధినాటిక కూడా అలా ప్రజాపోరాటాల్లో మమేకం అవుతున్నది. ఆ ప్రక్రియే ఓ నాటక శిక్షణగా రూపొందటాన్ని కాదనలేం. ప్రాచీన వీధి నాటకం నుండి ఈ ఆధునిక వీధి నాటకం వరకూ మన తెలుగు నాటకానిదో అద్భుత పరిణామం, వికాసం. వాటిని గ్రంథస్థం చేయడంతో పాటు తెలుగు వారికి ఓ స్థిరమైన ప్రత్యేక నాటక విద్యాలయం ఏర్పాటు చేయడం ఎంతైనా అవశ్యం.
(నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం)
- కె.శాంతారావు, 9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
భూమిని కాపాడుకుందాం
అందమైన మానవ నిర్మిత నగరం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.