Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా? | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 07,2023

స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?

         దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత (Legalize) లభిస్తుందా అన్న విషయం నేడు అత్యంత ఉత్కంఠగా మారింది. ఒక పక్క స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే అంశంపై సానుకూలతతో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్న నేపధ్యం, మరొక పక్క సామాజిక నైతికత దష్ట్యా స్వలింగ వివాహాలకు ఎట్టి పరిస్ధితులలో చట్టబద్దత ఇవ్వకూడదు అని మత సంఘాలు సాంప్రదాయవాదులు కేంద్రం వంటి విభిన్న వైఖరుల మధ్య స్వలింగ వివాహాల చట్టబద్ధతపై ఏ నిర్ణయం రానుంది అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఈ అంశంపై నేటి కవర్‌ స్టోరీ కథనం..
మనిషికి తోడు కావాలి. చిన్నతనంలో అయితే తల్లిదండ్రులు, కొంత వయసు వచ్చాకా స్నేహితులు, ఆపై యుక్త వయసు వచ్చాకా తోడుగా భార్యా లేదా భర్త, వద్దాప్యంలో అయితే పిల్లలు. ఈ తీరు కేవలం భారతీయ సమాజంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే కొనసాగుతూ ఉంది. అయితే ఇటువంటి సమాజాలలో నెలకొన్న సంప్రదాయాలు, సంస్కతులు కట్టుబాట్లు మధ్య నలిగి పోతూ వివక్షతకు గురి అవుతూ ఉన్న ఓ వర్గం ఉంది. అదే మైనారిటీ లైంగిక వర్గం.. అయితే వీరిని సమాజం ఏ విధంగానూ ఆమోదించడం లేదు. ఒక విధంగా చూస్తే వీరికి అస్తిత్వం అనేది లేదనే చెప్పాలి. ఈ సమయంలో కుటుంబం మరియు సమాజం నుండి వీరికి ఎదురయ్యే ప్రతికూలతలను దాటుకుని తమ అస్తిత్వం కోసం నిరంతరం పోరాటం సాగిస్తూ కొన్ని హక్కులను అయితే సాధించారు. సాధారణంగా ప్రకతి సహజంగా లైంగిక పరిభాషలో సష్టిలో స్త్రీ, పురుషులు మాత్రమే కనిపిస్తారు. జంతువులలో కూడా అంతే.
ఈ భిన్న లింగాలలో స్త్రీ అంటే పురుషుడికి, పురుషుడు అంటే స్త్రీకి ఆకర్షణ ఏర్పడటం అనేది అత్యంత సహజంగా కనిపించే ప్రకతి ధర్మం. అయితే ఈ రెండింటికి మధ్య కొత్త లైంగిక వర్గం చేరింది. అదే తతీయ లింగ వర్గం.
సాధారణంగా భిన్న లింగాలైన ఆడ, మగ మధ్య మాత్రమే ఆకర్షణ ఉంటుంది. అయితే లైంగికంగా ఒకే విధంగా కనిపించే స్వలింగాల మధ్య కూడా ప్రేమ, ఆకర్షణ, సంపర్కం ఉంటుంది అనేది ప్రకతిలో కనిపిస్తున్న ఓ అసాధారణ అసహజ విషయం. దీని పట్ల అవగాహన కలగడానికి ఈ స్వలింగ వర్గాల వారి వైఖరులను ముందుగా పరిశీలించాలి. ఎందుకంటే లైంగికంగా ప్రకతి ధర్మానికి భిన్నంగా కనిపించే ధోరణులు ఈ వర్గం వారి అందరిలో ఒకేలా ఉండవు. అందుచేత ఈ కమ్యూనిటీకి చెందిన వారందరినీ విభిన్న కాంబినేషన్లుగా చూపుతారు. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సెక్సువాలిటీ రెండు ఓరియెంటేషన్‌. సెక్సువాలిటీలో మూడు రకాలైన జెండర్లు ఉంటాయి. అవి పురుష, స్త్రీ, ట్రాన్స్‌ జెండర్‌. ఈ ముగ్గురిలో మొదట ఇద్దరిని పుట్టుకతో గుర్తించగలం. ట్రాన్స్‌ జెండర్‌ విషయంలో 10 సంవత్సరాలు తరువాత వారి ప్రవర్తనను బట్టి గుర్తించగలం. అదే ఓరియెంటేషన్‌ విషయంలో వాళ్ళు చెబితే కానీ గుర్తించడం సాధ్యం కాదు.
వీటన్నింటినీ ఒక ఫామ్‌గా చేసి పేర్కొంటారు. అది LGBTQIA+ కమ్యూనిటీ..
1) L అంటే లెస్బియన్‌ : లెస్బియన్‌ అంటే ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ప్రేమ, సెక్స్‌ చేయాలనే కోరిక కలగడం.
2) G అంటే గే : ఒక పురుషుడికి మరో పురుషుడిపై ప్రేమ కలగడం. సెక్స్‌ చేయాలని కోరిక కలగడం.
3) B అంటే బైసెక్సువల్‌ : బైసెక్సువల్‌ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగవచ్చు. ఒక పురుషుడికి మరో పురుషుడిపై ప్రేమ కలగవచ్చు, లేదా స్త్రీపై ప్రేమ కలగొచ్చు. అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పై లేదా మగాడిపై ప్రేమ కలగవచ్చు.
4) T అంటే ట్రాన్స్‌జెండర్‌ : ట్రాన్స్‌జెండర్‌ అంటే మూడో జెండర్‌కి చెందిన వ్యక్తి. పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు. మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు. ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు. ట్రాన్స్‌జెండర్ల మనసులో ఉండే ఆలోచన వాళ్ల దుస్తుల రూపంలో కనిపిస్తుంది.
5) I అంటే ఇంటర్‌సెక్స్‌ : పుట్టినపుడు జననాంగాలను బట్టి వాళ్లు మగపిల్లలో, ఆడపిల్లలో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నవాళ్లను ఇంటర్‌సెక్స్‌ అంటారు. డాక్టర్లు వాళ్లను పరిశీలించి.. ఈ పాప ఆడపిల్ల, వీడు మగపిల్లాడు అని చెబుతారు.
6) Q అంటే క్వీర్‌ : ఈ వర్గం వాళ్లకు తాము ఎవరనే విషయంపై వాళ్లకే స్పష్టత ఉండదు. తాము పురుషులా స్త్రీల, ట్రాన్స్‌జెండరా అన్నది వాళ్లకే తెలీదు. తమకు ఎవరు ఇష్టం అన్నది కూడా వాళ్లకు అర్థం కాదు. అందుకే వీళ్లను క్వీర్‌తో పాటు క్వశ్చనింగ్‌ అని కూడా అంటారు.
7) A అంటే అసెక్సువల్‌ : ఎవరికైతే ఎటువంటి సెక్స్‌ కోరికలు ఉండవో వారిని అలైంగిక వర్గం అంటారు.
8) + ప్లస్‌ : అంటే ఎవరైతే అన్నీరకాలైన జెండర్లకు ఆకర్షితులవుతారో వారిని ప్లస్‌ అంటారు.
ఈ తరహా కమ్యూనిటీ విశ్వ వ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచ లెక్కల ఆధారంగా వీరి సంఖ్య 13 కోట్లకు పైబడి ఉంటుందని ఓ అంచనా. అయితే ఈ లెక్కలు కూడా సరికాదనే చెప్పవచ్చు. ఎందుకంటే సామాజిక అవహేళనకు భయపడి చాలామంది తమ లైంగికతను బయటకు చెప్పుకోలేనివాళ్ళను కూడా లెక్కలోనికి తీసుకుంటే ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. 2012లో భారత ప్రభుత్వం సుప్రీమ్‌ కోర్టుకు అందించిన లెక్కల ప్రకారం చూస్తే వీరి సంఖ్య 25లక్షలు. మరొక గమనించదగిన విషయం ఏమిటంటే చాలాకాలం వరకూ ప్రభుత్వాలు వీరిని జనాభా లెక్కలలో ప్రత్యేక వర్గంగా గుర్తించలేదు. కాలగమనంలో సెన్సస్‌లో స్త్రీ, పురుషుడితో పాటు ఇతరులు అనే కాలమ్‌ చేర్చాల్చి వచ్చింది. అప్పటి నుండి వీరి సంఖ్య దాదాపుగా తెలుసుకోడానికి వీలు పడింది. చారిత్రకంగా చూస్తే ఈ వర్గంవారు ఎప్పటి నుంచో ఉన్నారనే ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే సమాజంలో వీరి పట్ల చాలా చులకన భావం ఉంది. న్యూనతా భావంతో, నిరాదరణతో జీవిస్తున్న ఈ వర్గం కాలక్రమంలో సంఘటితం కావడం మొదలుపెట్టారు. అయినా ప్రభుత్వాలు వారి చర్యలు ప్రత్యేకించి స్వలింగ సంపర్కాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నేరంగా పరిగణించి కఠిన శిక్షకు రూపొందించాయి. మనదేశం కూడా దీనిలో భాగంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ కమ్యూనిటీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని రద్దు చేయాలని అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉంది. ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు వీరికి మద్దతుగా చేపట్టిన ఉద్యమాలు; న్యాయస్ధానాలలో వేసిన పిటీషన్ల ఫలితంగా ప్రపంచంలో కొన్ని దేశాలు నేరంగా పరిగణించడాన్ని విరమించుకున్నాయి. అదే స్ఫూర్తితో మిగిలిన దేశాలలో కూడా వీరు చేస్తున్న పోరాటంలో భాగంగా మన దేశంలో కూడా స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించడాన్ని రద్దు చేయాలని శాంతియుతంగా ఉద్యమాలు చేయడం, న్యాయ స్థానాలలో పిటీషన్లు వేయడం వల్ల ఢిల్లీ హైకోర్టు ఐ.పీ.సీ 377ను వీరి విషయంలో రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటీషన్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయడం వీలు పడదని ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. మరలా ఈ కమ్యూనిటీ సుప్రీమ్‌లో వేసిన రివ్యూ పిటీషన్లో మాత్రం స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీని ద్వారా స్వలింగ సంపర్కుల పోరాటానికి ఎంతో మద్దతు లభించింది. ఈ తీర్పును స్ఫూర్తిగా తీసుకుని వీరు మరొక న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అదే స్వలింగ వివాహాల చట్ట బద్దత. దేశంలో గల వివిధ రాష్ట్రాలలో ఈ విషయమై అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. సుప్రీంలో కూడా పలు పిటీషన్లు దాఖలు కావడం ఈ నేపథ్యంలో సుప్రీం దిగువ స్ధాయిలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటిని ఒక్కటిగా చేసి విచారణకు సిద్ధమవుతూ ఈ సమస్యపై సానుకూలతగా ఉన్న సుప్రీం, కేంద్రాన్ని ఈ విషయంలో వివరణ ఇవ్వమని ఆదేశించింది. కేంద్రం మాత్రం స్వలింగ వివాహాలకు చట్టబద్దత ఇవ్వలేమని సామాజిక నైతికత గల ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని కోర్టుకు తెలిపింది.
ఈ నేపధ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించడంపై దేశంలో చర్చ మొదలయ్యింది. సాధారణంగా వివాహం అంటే బంధు మిత్రుల సమక్షంలో తమ మత సాంప్రదాయాలకు అనుగుణంగా జరిపే వేడుకలో వధువు, వరుడు జంట కావడం. అంటే ఈ జంట నూతన జీవితాన్ని ప్రారంభించి పునరుత్పత్తికి దోహద పడుతుంది. దీనిని కుటుంబం అంగీకరించింది. సమాజం అంగీకరించింది. అంతకు మించి చట్టం కూడా అంగీకరించింది. ఇదంతా సాంప్రదాయ వివాహాల తంతు. కాల గమనంలో ఈ వివాహాల తీరు మాత్రం గత వందేళ్ల నుంచి మారుతూ వస్తోంది. వివాహం అంటే స్త్రీ పురుషుడు కలసి చేసుకునే ఓ జీవిత ఒప్పందం అనే భావన నుండి అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక స్త్రీ వేరొక స్త్రీతో ఒక పురుషుడు వేరొక పురుషుడితో వివాహాలు చేసుకునే అసహజ ప్రక్రియ మొదలయ్యింది. అంటే స్వలింగ వివాహాలు ఆరంభం అయ్యాయి. అయితే ఈ వివాహాన్ని బంధు మిత్రులే కాదు సమాజం అంగీకరించడం లేదు.
కేంద్రం వ్యతిరేకత
సుప్రీం కోర్టుకు కేంద్రం అందించిన అఫిడవిట్‌లో స్వలింగ వివాహాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఇవి.
1) పెళ్లి అనేది పురుషుడు, మహిళకు ఉద్దేశించిన అంశం. ఒకే జననేంద్రియాలు కలిగిన వ్యక్తుల మధ్య వైవాహిక బంధానికి గుర్తింపునిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
2) మతాలుకు ఇది అభ్యంతరకరం. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపునిస్తే... హిందూ వివాహ చట్టంతో పాటు వివిధ మతస్థుల వైయక్తిక చట్టాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
3) స్వలింగ వివాహానికి చట్టబద్ధ హోదాను ఖరారు చేయడం అన్నది న్యాయస్థానాలు, చట్టసభల నిర్ణయం ద్వారా జరగరాదు. సమాజం నుంచే దానికి ఆమోదం లభించాలి.
4) స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని 2018లో తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదు.
5) భారతీయ కుటుంబ వ్యవస్థకూ, ఈ స్వలింగ వివాహాలకూ ఎట్టి పరిస్ధితులులో పొంతన కుదరదు.
6) వివాహ వ్యవస్థలో ఎన్నో బాధ్యతాయుత అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటిని దష్టిలో ఉంచుకుని స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వకపోవడం అనేది ఎంత మాత్రం చట్టవ్యతిరేకం కాదని గుర్తించాలి.
7) స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదు కానీ వారిని భార్య భర్తలలా చూడాలనడం మాత్రం భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్దం.
8) స్వలింగ వివాహాలకు చట్టబద్ధత నిస్తే, అనేక చట్టాలను పునర్నిర్వచించక తప్పదు. అది పెద్ద సవాలు. ఒక వేళ ఈ సవాలుకు సిద్ధమై, సమాజంలో అందరినీ సిద్ధం చేయకుండా తొందరపడితే మాత్రం ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
9) స్వలింగ పెళ్లిళ్లకు గుర్తింపునిస్తే వైయుక్తిక చట్టాలు, సామాజిక, కుటుంబ వ్యవస్థ, విలువల సమతుల్యం పూర్తిగా దెబ్బతింటుంది.
10) స్వలింగ వివాహాలకు చట్టబద్ధత డిమాండ్‌ అనేది కేవలం పట్టణ ఉన్నత వర్గాల దక్పధం మాత్రమే..
11) భారతదేశంలో పురుషుడు, మహిళ మధ్య వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నప్పటికీ, వివాహం తప్పనిసరిగా పురాతన ఆచారాలు, సాంస్కతిక విలువలు, సామాజిక విలువలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
12) సంప్రదాయ వివాహం చేసుకున్న వారికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటికి లోబడి వారు నడుచుకుంటారు. ఇలాంటి విధానమే 'భారత్‌ వసుధైక కుటుంబం' అనే నానుడికి కారణమైంది. పైగా సంప్రదాయ వివాహం చేసుకున్న వారికి ఓ నియంత్రణ ఉంటుంది. కానీ స్వలింగ వివాహం చేసుకున్న వారికి ఇది ఉండదు. ఫలితంగా సమాజంలో అంతరాలు ఏర్పడతాయి.
13) స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదు. కానీ, దీన్ని భార్య, భర్త, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ యూనిట్‌తో పోల్చలేం. ఒకవేళ స్వలింగ వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తే అది ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాలను, నోటిఫైడ్‌ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది.
14) మత, సామాజిక కట్టుబాట్లతో లోతుగా మమేకమైన దేశ శాసన విధానాన్ని కోర్టులు మార్చకూడదని, ఈ అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలని కేంద్రం కోర్టుకు విన్నవించింది.
కేంద్ర ప్రభుత్వమే కాదు స్వలింగ సంపర్కాన్ని ఆమోదించిన ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు కూడా స్వలింగ వివాహాలకు నో చెబుతున్నారు. అంతకన్నా ప్రదానంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ మొదలు పెట్టకముందే వివిధ రాష్ట్రాలకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించవద్దంటూ లేఖ విడుదల చేయడం విశేషంగా చెప్పవచ్చు.
సంప్రదాయవాదుల వ్యతిరేకత : స్వలింగ సంపర్కాన్ని 2018 లో సుప్రీం కోర్ట్‌ నేరం కాదని తీర్పు ఇచ్చింది. అయితే నేటికి కూడా వివిధ మతాలు, పౌరసమాజం కూడా ఇది ఏమాత్రం సామాజిక నైతికతతో కూడినది కాదని తీవ్రంగా ఖండిస్తున్న సమయంలో నేడు మరలా ఈ అసహజ సంబంధాన్ని వివాహం పేరిట చట్టబద్దం చేయాలి అని డిమాండ్‌ చేయడం ఏమిటని వివిధ మత సంఘాల పెద్దలు, సాంప్రదాయ వాదులు వాదిస్తున్నారు. స్వలింగ సంపర్కమే ప్రకృతి అసహజం. అందునా సాంస్కృతిక, మతపరమైన విలువలకు అత్యంత ప్రాధాన్యత కల్పించే మనదేశంలో స్వలింగ వివాహం అనేది మన సంస్కృతికి విఘాతం కలిగించి విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించడం అవుతుందని అన్ని మత సంఘాల పెద్దలు దీనిని ఖండిస్తున్నారు.
దేశంలోని అన్ని మతాలు స్వలింగ సంపర్క వివాహాలపై విముఖంగా ఉన్నాయి. ఎస్‌జీబీటీక్యూ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే కాల గమనంలో మత సంఘాల స్వరంలో మాత్రం క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు స్వలింగ సంపర్కుల పట్ల కఠినంగా మాట్లాడే వారు. క్రమంగా కాస్త స్వరం తగ్గించారు. అయితే, స్వలింగ వివాహాలకు మాత్రం వీరు ఏ విధంగానూ మద్దతు తెలుపడం లేదు.
పౌర సమాజం వ్యతిరేకత :వీరికి హక్కులు కల్పించే విషయంలో కానీ ప్రత్యేక ఛట్టం రూపొందించి వివాహాన్ని క్రమబద్దం చేసే విషయంలో కానీ పౌర సమాజంలో దాదాపు 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో నిర్వహించే పోల్స్‌లో మనకు ఈ ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి కేంద్రం వాదన కరెక్ట్‌ అవుతుంది కదా అని సమర్ధించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. సంప్రదాయాలు సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే మన దేశంలో సంప్రదాయ నైతికత దృష్ట్యా చూస్తే దీనికి ఏ విధంగానూ అంగీకారం లభించదు..
ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించక పోవడం బట్టి చూస్తే దీనిపై సమాజంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతుంది. అంతే కాదు చాలా పాశ్చాత్య దేశాలు కూడా ఈ ధోరణిపై నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పిస్తే ఎదురయ్యే సవాళ్లు, స్వలింగ వివాహానికి చట్ట బద్దత ఇచ్చినప్పుడు ఎదురయ్యే సవాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ సందర్భంలో పాశ్చాత్య దేశాలకు మనకు పోలిక సరికాదు.
గృహహింస : గృహహింస సమస్య కేసుల్లో కుటుంబంపై ఫిర్యాదుచేసే హక్కు మహిళలకు ఉంటుంది. ఇక్కడ స్వలింగ సంపర్కుల్లో ఇద్దరూ మహిళలే ఉన్న జంటను తీసుకుంటే, గృహహింస కింద ఎవరు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఇద్దరు పురుషులు అయితే, ఇద్దరూ ఫిర్యాదు చేయొచ్చా లేదా ఇద్దరూ చేయకూడదా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.
విడాకులు భరణం : పెళ్లి తర్వాత, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, భరణం ఎవరికి ఇస్తారు? అనే ప్రశ్న మరొకటి. విడాకుల తర్వాత భర్త నుంచి భార్యకు భరణం ఇచ్చే హక్కును సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125 కల్పిస్తోంది. అదే సెక్షన్‌ కింద తల్లిదండ్రులు కూడా కొడుకు నుంచి మెయింటెనెన్స్‌ను పొందొచ్చు. అయితే, ఇప్పుడు స్వలింగ సంపర్కుల విషయానికి వస్తే, ఇద్దరూ భరణం కోసం కేసులు వేయొచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
పిల్లల దత్తత : ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషుడు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఇక్కడ దత్తత తీసుకునే బిడ్డ, తల్లిదండ్రుల మధ్య 21 సంవత్సరాల తేడా ఉండాలి. ఈ విషయంలో ఇక్కడ ఇద్దరు స్వలింగ సంపర్క మహిళలకు కేవలం అమ్మాయిలనే దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తారా? స్వలింగ సంపర్క పురుషులకు కేవలం అబ్బాయినే దత్తత తీసుకొనేందుకు అనుమతిస్తారా? మరో విషయం ఏమిటంటే ఈ కుటుంబంలో తండ్రి ఎవరు? తల్లి ఎవరు? అనేది మరో ప్రశ్న.
పిల్లలను ఎవరికి అప్పగించాలి? : చట్ట ప్రకారం విడాకుల సమయంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసుండే పిల్లలను తల్లికి అప్పగిస్తారు. అదే స్వలింగ సంపర్కుల విషయంలో ఎవరికి బిడ్డను అప్పగిస్తారే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. వారసత్వపు ఆస్తులు విషయంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. ముందుగా వీటి అన్నింటికీ పరిష్కారాలు చూపకుండా స్వలింగ వివాహాలకు చట్టబద్దత ఎలా ఇవ్వగలం అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 1989లో ప్రపంచంలోనే తొలిసారిగా డెన్మార్క్‌ స్వలింగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టం చేసింది. ఇక బ్రిటన్‌లో ఈ పెళ్ళిళ్ళను అంగీకరించడానికి 32 ఏళ్ళు పట్టింది. అమెరికాలో పుష్కర కాలమైంది. ఫ్రాన్స్‌లో ఏకంగా 220 ఏళ్ళు పట్టింది. కాబట్టి దీనిపై మన దేశ పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల నుంచి అన్ని రకాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా చటుక్కున తేల్చే వ్యవహారం మాత్రం కాదనే చెప్పవచ్చు.
శాస్త్రీయ వాదుల సమర్ధన : అయితే ఇది పాశ్చత్య ప్రభావం ఎంత మాత్రం కాదని హార్మోన్లలో అసమతౌల్యం వలన ఏర్పడే అనివార్య పరిస్ధితి అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీరి ప్రకారం శరీరంలో ఈస్ట్రోజన్‌ కొంచెం ఎక్కువగా ఉండే పురుషులు, స్త్రీల దుస్తులు ధరించాలని కోరుకుంటారు. కాని పురుషులుగానే చలామణి అవుతుంటారు. వారు భార్యతో సజావుగానే సంసారం చేస్తారు. స్త్రీల లాగా ఉండాలన్న వారి ఆలోచన అంతరంగంలో రహస్యంగానే ఉంటుంది. అదే ఈస్ట్రోజన్‌ అధిక మోతాదులో ఉన్న పురుషుడు తాను స్త్రీగా ఉండాలన్న కోర్కెను బహిరంగంగానే వ్యక్తం చేస్తాడు. స్త్రీ దుస్తులు ధరిస్తాడు. స్త్రీల లాగా అలంకరించుకుంటాడు. కనుక మనిషి లైంగిక స్వభావాన్ని నిర్ణయించేవి హార్మోనులే. అందుచేత దీనిని వారి సహజ స్వభావంగా చూడాలేతప్ప అదొక మానసిక రోగంగా చూడరాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాదు ఈ రకమైన వైఖరి కొత్తగా ఈ రోజు పుట్టింది కాదు. పురాణ ఇతిహాసాల్లో హిందూ దేవలయాలపై ఉన్న శిల్పాల్లో కూడా ఇది మనకు కనిపిస్తుంది అని అభ్యుదయ వాదులు చెబుతున్నారు.
అభ్యుదయ వాదుల సమర్ధన : మతాలన్నీ వ్యతిరేకిస్తున్నా మానవతా దృక్పథంతో సుప్రీం ధర్మాసనం వీరి గురించి ఆలోచిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డు పడటం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగంలో మేజర్‌ అయిన వ్యక్తి అన్నారు తప్ప మేల్‌ ఫిమేల్‌ అని స్పష్టత చెప్పలేదు. ఈ సందర్భంలో లింగత్వంతో సంబంధం లేకుండా మేజర్‌ అయిన వారు నచ్చిన వారిని వివాహం చేసుకుని విధంగా చట్టం తీసుకు వస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ దీనిని అడల్ట్‌ మధ్య బంధంగా మాత్రమే గుర్తించాలి. ఇద్దరు వ్యక్తులు ఆనందంగా ఉండటానికి ఓ బంధం ఏర్పాటు చేసుకోవడం వలన సమాజానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి. వీరి వలన సమాజానికి కలిగిన నష్టం ఏమిటి? 140 కోట్లా జనాభాలో దాదాపు ఒక కోటి మందిగా ఉండే వీరి హక్కులు ను పరిగణలోనికి తీసుకోకుండా వీరిపై వివక్ష హింస అనేది హక్కుల హననం కాదా. వీరి పట్ల సానుకూలత చూపించి ఈ వర్గాల వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వీరి వాదన.
లింగ సమానత : రాజ్యాంగం లింగ సమానత పేర్కొంది. అటువంటప్పుడు వీరి పట్ల ఎందుకు వివక్ష చూపుతుంది. కేవలం హార్మోన్ల ఆసమతౌల్యం వలన ఏర్పడిన ఈ స్ధితిలో వీరి పట్ల వివక్షత చూపడం ఎంతవరకు ధర్మం. సుప్రీం కోర్టు కూడా జెండర్‌ అనేది అవయవాలు బట్టి కాకుండా మైండ్‌ బట్టి నిర్దారణ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వీరి వివాహాలు చట్ట బద్ధతకు పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్రం చెబుతుంది. నిజమే ఎందుకంటే వీరి పరిస్ధితులు గురించి సమాజానికి అవగాహన కల్పించక పోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అందువల్లనే ఈ కమ్యూనిటీ పై న్యూనతా భావం వివక్షత అగౌరవ పరిస్ధితులు వెంటాడుతున్నాయి.
వీరు కోరుకునేది ఒకటే. సమానత్వం కోసం, గౌరవం కోసం అందరిలాగే మమ్మల్ని గుర్తించాలని. ఇది తప్పు కాదు కదా.. పెళ్లి చేసుకుని వీళ్ళేం చేస్తారు? వీరికి సంతానం ఉండదు కదా. అనే అభ్యంతరాలు ఎన్నో ఎదురవుతున్నాయి. దత్తత, సరోగసీ ద్వారా కూడా సంతానాన్ని పొందే అవకాశం వీళ్లకు లేకపోలేదు. అంతే కాదు సహజ తల్లిదండ్రులు కన్నా సమాజంలో నుండి నెట్టి వేయబడ్డ వీరికి పిల్లల్ని సరైన రీతిలో ఎలా పెంచాలి? వారికి ఎటువంటి మార్గదర్శకం చేయాలనేది సహజ తల్లి తండ్రులు కన్నా మాకే తెలుసు అనేది వీరి వాదన.
పెంచగలిగే సమర్థత మాకు ఉన్నప్పటికీ కూడా మాపై చూపుతున్న వివక్షత ఎంత వరకు సమంజసం. వివాహాన్ని ఇద్దరి వయోజనుల మధ్య బంధంగా గుర్తించాలి తప్ప ఆడ మగ సంబంధం గా భావించకూడదు. కుటుంబం అంటే కేవలం ఆడ మగ అని నిర్దారించడానికి మీరు ఎవరు అని ఈ కమ్యూనిటీ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేశ జనాభాలో లైంగిక మైనార్టీగా కొనసాగే వీరిపై చిన్న చూపు చూడటం ఏ మాత్రం మానవత్వం అనిపించుకోదు.
జననాంగాల ఆధారంగా ఆడ మగ అని వర్గీకరణ చేసి వివాహ వ్యవస్ద నేడు కొనసాగుతుంది. అయితే వాస్తవంగా లింగత్వానికి భిన్నంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ఇద్దరి మనసుల మధ్య అవగాహనతో జీవించడాన్ని మనం ఎలా కాదనగలం? ఎందుకు చట్ట బద్దట కల్పించలేం? దీనిని వ్యతిరేకిస్తే అది జీవించే హక్కును భంగ పరిచినట్టు కాదా?
ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ :స్వలింగ వివాహాల చట్టబద్దత విషయంలో ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ సంస్ధ LGBTQ+ కమ్యూనిటీకి అండగా నిలిచింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్‌మైండ్‌తో ఆలోచించాలని, సేమ్‌ సెక్స్‌ కపుల్‌ కూడా గుడ్‌ పేరెంట్స్‌గా ఉండగలరని వాదిస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్‌ కూడా దాఖలు చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పిస్తే వాళ్లు పెంచుకునే పిల్లల జీవితాలు ఆగమైపోతాయన్న వాదనను DCPCR కొట్టిపడేసింది.
పోరాటాలు : మతపరమైన, భాషా పరమైన మైనారిటీల్లాగే లైంగికపరమైన మైనారిటీలుగా చెప్పబడే ఎల్జీబీటీ కమ్యూనిటీ తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. ఈ పోరాటంలో భాగంగానే వారికి ఓటర్ల జాబితాలో 'థర్డ్‌ సెక్స్‌'గా ప్రత్యేక గుర్తింపు కల్పించాలన్న డిమాండ్‌ మన దేశంలో 1994 నుంచే మొదలైంది. అది చివరికి 2009లో నెరవేరింది. హిజ్రాలకు, లింగ మార్పిడి చేయించుకున్న వారిని 'అదర్స్‌'గా ఓటర్ల జాబితాలో ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. భారత్‌తో పోలిస్తే, పాశ్చాత్య దేశాల్లో ఎల్జీబీటీ వర్గం కోసం పోరాడే సంస్థలు చాలా క్రియాశీలంగా ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయి. బ్రిటన్‌లో దాదాపు 50 మంది స్వలింగ సంపర్కులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
అవగాహన లోపం : ఈ కమ్యూనిటీ గురించి విద్యావంతులలో సైతం తెలియని వాళ్లే ఎక్కువ. ఎందుకంటే ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకోవడం కూడా ఓ అంటరాని విషయం, అనైతికం అనే భావం చాలా మందిలో పేరుకు పోయింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు కూడా వీరి ఈ పరిస్ధితికి హార్మోన్లలో అసమతౌల్యం ఎలా కారణంగా నిలిచింది అనే విషయాలను ప్రచారం చేయడంలో విఫలం అయ్యిందనే చెప్పవచ్చు. ఈ సందర్భంలో పౌర సమాజం వీరిపట్ల చూపే న్యూనతా భావం మరొక పక్క కుటుంబ సభ్యుల వత్తిడి కారణంగా ఎందరో ఈ కమ్యూనిటీకి చెంసిన వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొందరైతే దేశం విడిచిపెట్టి పారిపోతున్నారు.
దేశంలో పౌరులందరూ సమానులేనన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. అంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, అలవాట్లు, నమ్మకాలను బట్టి దాన్ని మార్చలేం. మార్చకూడదు. కాబట్టి స్వలింగ సంపర్కులకూ అందరితో సమానంగా హక్కులు రాజ్యాంగ విహితమే రాజ్యాంగ నైతికత కూడా అయితే ఇదే సందర్భంలో, సంప్రదాయవాద భారతీయ సమాజంలో స్వలింగ వివాహం అనేది మాత్రం సున్నితమైన అంశం కనుక దీనిపై ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సిన అభిప్రాయం ఎంతైనా ఉంది.
ప్రపంచంలో చాలా దేశాల్లో స్వలింగ సంపర్కం విషయంలో కానీ స్వలింగ వివాహం చట్ట బద్దత విషయంలో కానీ ముందుగా వ్యతిరేకించినప్పటికి కాల గమనంలో విస్తత చర్చలు జరిపి వాటికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ విధంగా చూసినా ప్రపంచం మొత్తంలో కేవలం 33 దేశాల్లో మాత్రమే స్వలింగ వివాహాలకు చట్ట బద్దత లభించింది.
సుప్రీం సమర్ధన : వివాహం చేసుకునే ఇద్దరు వ్యక్తులకు లింగ భేదం తప్పని సరిగా ఉండాలా స్వలింగ బంధాలను కేవలం శారీరక బంధాలుగా మాత్రమే కాకుండా ఒక నిలకడైన, భావోద్వేగంతో కూడుకున్న బంధాలుగా ఎందుకు పరిగణించకూడదు అంటూ వారి మధ్య సుస్థిర, భావోద్వేగ సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటే వివాహ భావననే పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ధర్మాసనం చట్టాన్ని కాదని విస్తత భాష్యం చెప్పాల్సిన ఇటువంటి కేసుల్లో రాజ్యాంగంలోని 145(3) ఆర్టికల్‌ ప్రకారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చివరకు ఎంతో ప్రభావశీలమైన ఈ కేసులో తుది వాదనలు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విని, నిర్ణయిస్తుందని సుప్రీం తేల్చి చెప్పింది. అయితే నేటికి కూడా వివాహం అంటే ఒకే కులం, మతం, సంప్రదాయాలకే మొగ్గు చూపే మెజారిటీ ప్రజలు కలిగిన మన దేశంలో ఈ తరహా సంస్కరణ తీసుకు రావడం అనేది చిన్న విషయం మాత్రం కాదు. మార్పు భావోద్వేగభరిత అంశం.
భారత్‌ మరి గత అయిదేళ్ళలోనే ఈ సంప్రదాయ విరుద్ధ, సాహసోపేత నిర్ణయం తీసుకొనే దశకు చేరుకుందా? ఆధునిక సమాజంలో ఎల్జీబీటీ హక్కుల్ని కాదనలేం. కానీ ఇప్పటికీ పెళ్ళంటే ఒకే కులం, మతం, సంప్రదాయాలకే మొగ్గే మెజారిటీ జనమున్న దేశంలో ఈ మార్పు భావోద్వేగభరిత అంశం. అందుకే కేంద్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది.
స్వలింగ వివాహాలకు చట్టబద్దత సాదించుకునే విషయంలో LGBTQIA+ కమ్యూనిటీ మాత్రం సుప్రీం పైనే ఆశలు పెట్టుకుంది. అయితే పౌర సమాజంలో కూడా వీరి పట్ల వివక్షత క్రమేపీ తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వ్యూ రీసెర్చ్‌ చేసిన సర్వే ఆధారంగా 2014 వ సంవతర్రం వీరి పట్ల ఆమోదం, మద్దతు తెలిపిన వారు కేవలం 15 శాతంగా ఉంటే అదే 2020కు వీరిని ఆమోదించే వారి సంఖ్య 37 శాతానికి పెరిగింది. అంటే 6 సంత్సరాలలో వీరిని ఆమోదించే వారు 22 శాతం పెరిగారు. పౌర సమాజంలో వీరు ఎదుర్కొనే వివక్షత పట్ల అవగాహన కలిగి, వారిని ఆమోదించే వారి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సెక్స్‌, సెక్సువాలిటీ పట్ల భారతీయుల వైఖరి ఇంకా సాంప్రదాయంగానే కొనసాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పౌర సమాజం ముఖ్యంగా సంప్రదాయవాదులు, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెజార్టీ సంప్రదాయ సమాజం స్వలింగ వివాహాలను ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఇటువంటి సంకట సమయంలో సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒక్కటే. దేశంలో అమలులో ఉన్న వివిధ వివాహ చట్టాల పరిధిలో పెళ్లి చేసుకునే అవకాశాన్ని స్వలింగ సంపర్కులకు లేకుండా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా? అన్నది తేల్చాలి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న LGBTQIA+ కమ్యూనిటీ అంతా సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోంది. స్త్రీ పురుషుల మధ్య జరిగేది మాత్రమే పెళ్లి అనే సంప్రదాయ భావజాలం ఉన్న మనదేశంలో LGBTQIA+ కమ్యూనిటీ మధ్య స్వలింగ వివాహాలకు ఆమోదం లభిస్తుందా? స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు స్వలింగ వివాహాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. చివరిగా సామాజిక నైతికతకు రాజ్యాంగ నైతికత మధ్య ఏర్పడిన ఘర్షణలో త్రాసు ఎటువైపు మొగ్గు చూస్తుంది అనే దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం
అందమైన మానవ నిర్మిత నగరం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.