Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ బుడతడు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. నాలుగేండ్ల అద్వైత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు చెస్ శిక్షకుడిగా రికార్డు సృష్టించాడు. అద్వైత్ రెడ్డి వయసు 4 ఏండ్ల 6 నెలలు. 51 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు నిర్విరామంగా 30 గేమ్స్‌లో అద్వైత్ విజయం సాధించాడు. 2021లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ, 2022లో పాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ అధిగమించగా.. తాజాగా ఆ రికార్డును అద్వైత్ బద్దలుకొట్టాడు. సీజార్ చెస్ అకాడమీలో చెస్ ఓనమాలు నేర్చుకున్న అద్వైత్ సాధించిన ఘనత పట్ల తల్లిదండ్రులు సందేశ్ రెడ్డి, హిరణ్మై సంతోషం వ్యక్తం చేయగా, ఓక్రిడ్జ్ స్కూల్ యాజమాన్యం అభినందనలు తెలిపింది.