Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, భారత బాక్సింగ్ సూపర్‌స్టార్ నిఖత్ జరీన్‌ను మరో పురస్కారం వరించింది. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్.. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ అనంతరం వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన భారత తొలి మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా సాగుతున్న నిఖత్ జరీన్ శనివారం ముంబయిలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో ఐబీఎల్ఏ 'స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది.