Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దీపావళి సంబరాల సందర్భంగా టపాసులు కాల్చి కంటి గాయాలపాలైన వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థికసాయం చేశారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అవసరమయ్యే చికిత్స ఖర్చు మొత్తాన్ని కవిత తనకు లభించే నెల వేతనం నుంచి సాయంగా అందించారు. ఈ మేరకు సరోజిని దేవి ఆస్పత్రి అధికారులను కవిత మంగళవారం కలిశారు. పటాకులు కాల్చి కంటి గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థిక సాయాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే కంటి గాయాలైన బాధితులకు సాయంగా వచ్చిన అటెండెంట్‌లకు కూడా మూడు రోజులపాటు ఎమ్మెల్సీ కవిత భోజన వసతి కల్పించారు.