Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్దిపేట : సిద్దిపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)కి చెందిన ఓ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.20 వేలు బయటికొస్తున్నాయని తెలిసింది. దాంతో ఆ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా చేరుకుని డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఏటీఎంను మూసివేశారు. ఆ ఏటీఎంను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు.