Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : దీపావళి వేడుకల నేపధ్యంలో అపార్ట్‌మెంట్ వైపు రాకెట్లు విసిరిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఓ యువకుడు పలు రాకెట్లను అపార్ట్‌మెంట్ వైపు విసిరాడు. అవి అపార్ట్‌మెంట్ బాల్కనీలోకి, కిటికీల్లోకి దూసుకొచ్చాయి. అందుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో థానే పోలీసులు ఆ యువకుడిపై ఐపీసీ సెక్షన్ లు 285, 286, 336 కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.