Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని పీయూసీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, దండుమల్కాపూర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇన్ చార్జి జీవన్ రెడ్డి ప్రకటించారు. దండుమల్కాపూర్ లో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండుమల్కాపూర్ గ్రామాన్ని నూటికి నూరు శాతం అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.