Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : ప్రేమ పేరుతో కుటుంబ పరువు తీస్తుందంటూ కన్నకూతురిని తండ్రి నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో గీత(15) పదో తరగతి చదువుతోంది. అయితే ఆమె గత కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో ఉందని తండ్రి తెలుసుకున్నాడు. కుటుంబ పరువు తీయకంటూ గీతకు చెప్పాడు. కానీ గీత అవేవీ పట్టించుకోకుండా తన ప్రేమను కొనసాగిస్తుండడంతో ఆమె తండ్రి ఆగ్రహం పెంచుకున్నాడు. కుటుంబ పరువు దిగజార్చుతావా అంటూ గీత గొంతుపై తండ్రి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వనపర్తి జిల్లా డీఎస్పీ ఆనంద్ రెడ్డి తో పాటు పెబ్బేరు ఎస్సై అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.