Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గూగుల్ సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మరోసారి జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందన్న కారణంతో సీసీఐ ఇటీవల రూ.1,338 కోట్ల భారీ జరిమానా విధించింది. అయితే తాజాగా మరోసారి రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందంటూ సీసీఐ ఆరోపించింది. నిర్దేశిత గడువులోపల గూగుల్ తన వైఖరి మార్చుకోవాలనీ ఆదేశించింది.