Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో హృదయాన్ని కలిచి వేసే ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని తిర్వా ప్రాంతంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఓ బాలిక గాయాలతో రక్తస్రావంతో పడి ఉండగా, ఆమెకు సహాయం చేయకుండా కొందరు తమ మొబైల్ ఫోన్లతో ఆమెను వీడియో తీయడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
24-సెకన్లు గల వీడియోలో ఓ బాలిక ఆమె చేతిని (దానిపై రక్తపు మరకలు ఉన్నాయి) పైకి పట్టుకుని సహాయం కోసం అడుగుతున్నట్లు చూపిస్తుంది. చుట్టూ గుమిగూడిన కొంతమంది వ్యక్తులు పోలీసులను పిలవడం వినవచ్చు. కానీ ఎవరూ (వీడియోలో) పోలీసులనెఉ పిలవడానికి ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. పైగా తమ మొబైల్ ఫోన్లతో ఆమెను వీడియో తీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాలికను ఆటోలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు బాలికను చికిత్స నిమిత్తం కాన్పూర్‌కు తరలించారు.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బాధిత బాలిక ఆదివారం మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ప్రభుత్వ అతిథి గృహం సీసీటీవీ కెమెరా రికార్డ్ లను పరిశీలించగా.. ఓ యువకుడితో బాలిక మాట్లాడుతూ కనిపించింది. ఆమెపై లైంగికదాడి లేక లైంగిక వేధింపు జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. నివేదికల తర్వాత ఏదని చెప్పగలం అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కున్వర్ అనుపమ్ సింగ్ అన్నారు.