Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 30న చండూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. అదే విధంగా మరుసటి రోజు 31న మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ప్రచారానికి కేవవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనాయకులంతా మునుగోడు నియోజకవర్గంలోనే ఉన్నారు. ఇటీవల మునుగోడులో బీజేపీ సభ కంటే ఒకరోజు ముందు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాగా, మరుసటి రోజు జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరైన విషయం తెలిసిందే. మళ్లీ అదే రీతిలో బీజేపీ 31న బహిరంగ సభ నిర్వహిస్తుండగా అంతకుముందు రోజే సభకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి ఈ రెండు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ సభలు నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.