Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా నిలువనున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రమాణ స్వీకర కార్యక్రమం కోసం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటు సీడబ్ల్యుసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, సీఎల్పీ నాయకులు, మాజీ సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఇతర నాయకులు హాజరవుతారు. కాగా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే.. బుధవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడినుంచి ఏఐసీసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.