Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: జార్ఖండ్‌లోని గుర్పా రైల్వేస్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో 53 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. డబ్బాల్లో ఉన్న బొగ్గు నేలపాలయింది. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి. బుధవారం ఉదయం 6.24 గంటల సమయంలో ధన్‌బాద్ డివిజన్‌లోని గుర్పా స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. అయితే అదేసమయంలో ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లకు అంతరాయం కలిగినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా వ్యాగన్లను పక్కు తొలగిస్తామని, ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ పమాదంలో ఎవ్వరికీ ఎలాంగి గాయాలు కాలేదని చెప్పారు.