Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీల్లీ: కొత్తగా ముద్రించబోయే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటోతో పాటు వినాయకుడి ఫొటోను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ఉండగా మనం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని కేజ్రీవాల్ అడిగారు.కరెన్సీ నోట్లపై మన దేవతల ఫొటోలు ముద్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కదని అలాంటి సమయాల్లో మన శక్తియుక్తులకు దైవానుగ్రహం కూడా తోడైతే ఫలితం రావోచ్చాన్నారు. కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్ముడి ఫొటో, మరోవైపు లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించవచ్చని ఈ విషయం పట్ల త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైందన్నారు. ఢిల్లీలో సివిక్ పోల్స్ తో పాటు గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని తెలియజేశారు.