Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల్లో తెలుగు సినిమా క్రేజ్‌ను అమాంతం పెంచేశాడు. ఈ ఎపిక్ డ్రామా ప్రాజెక్ట్ అక్టోబర్ 21న జపాన్‌లో కూడా గ్రాండ్‌గా విడుదలైంది. కాగా ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో ఇంటర్నేషనల్ అవార్డు పడింది. సటర్న్ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు’కు ఎంపికైంది. సటర్న్ అవార్డ్స్ ఈ ఏడాదితో 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డును జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్ ను అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తనకు రెండో సటర్న్ అవార్డు అని రాజమౌళి అన్నాడు. అవార్డులు గెలుచుకున్న ఇతర విజేతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు జక్కన్న.