Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ కో– ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ అక్రమాల కేసులో ఈ నోటీసులు పంపించింది. నరేంద్ర చౌదరి గతంలో జూబ్లీహిట్స్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కేసు విషయంలో నవంబర్ ఏడో తేదీన ఉదయం పదిన్నర గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. సొసైటీ ఆస్తుల వివరాలు, ప్రభుత్వ కేటాయింపుల వివరాలు, ప్లాట్లు తీసుకున్న వ్యక్తుల వివరాలకు సంబంధించిన పత్రాలు వెంట తీసుకురావాలని సూచించింది. 1519 చదరపు గజాల భూమికి సంబంధించి అక్రమాలు జరిగినట్టు ఆరోపణలపై ఈడీ విచారణ చేపడుతోంది. ఆమెరికాలో స్థిరపడ్డ శిరీషకు సొసైటీ నిబంధనలు ఉల్లంగించి అప్పటి అధ్యక్షుడు, కార్యదర్శి ఈ ప్లాటు కేటాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శిరీషకు కేటాయించిన ఫ్లాట్ ను శ్రీహరిరావుకు గిఫ్ట్ డీడ్ తీసినట్టు గుర్తించారు. దీనిపై ఈడీ కొన్నాళ్లుగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ చానల్గా వెలుగొందుతున్న ఎన్టీవీ చైర్మన్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.