Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను వైదొలగడంతో కొంత ఉపశమనం లభించిందని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 'ఖర్గేకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆయన చాలా అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన కృషితో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలవనున్నారు.`
'కాంగ్రెస్ చాలా పెద్ద సవాళ్లను, ప్రమాదాలను గతంలో కూడా ఎదుర్కొంది. కానీ, ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. భవిష్యత్తులో పోరాడి విజయం సాధిస్తాం. కాంగ్రెస్ ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఓ చెక్కు చెదరని ఉద్యమంలా ఏండ్ల తరబడి నిలిచింది. పార్టీ ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఏర్పడిన ముప్పుతో పోరాడటమే అతిపెద్ద సవాల్` అని అన్నారు.
'ఈరోజు నేను ఉపశమనం పొందాను అని చెప్పాను. నేను ఎందుకు అలా చెప్పానో వివరిస్తాను. నా చివరి శ్వాస వరకు నేను పొందిన ప్రేమ, గౌరవాన్ని నేను గుర్తుంచుకుంటాను మరియు గుర్తిస్తాను. కానీ ఈ గౌరవం కూడా చాలా పెద్ద బాధ్యత. దాని ప్రకారం నేను బాధ్యతను భుజించాను. నా సామర్థ్యం.. ఈరోజు నేను బాధ్యతల నుంచి విముక్తి పొందుతాను. కాబట్టి సహజంగానే నేను ఉపశమనం పొందుతున్నాను` అని సోనియా గాంధీ అన్నారు.