Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఏటీఎమ్‌లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా షాపింగ్ కోసం నగదు తీసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లిన ప్రజలకు ఏటీఎంలో నుంచి నకిలీ నోట్లు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతోంది.
అమేథిలోని ఓ ఏటీఎమ్ నుంచి కొందరు స్థానికులు డబ్బులు డ్రా చేశారు. అయితే, అందులో నుంచి నకిలీ రూ.200 నోటు వచ్చింది. ఆ నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అది నకిలీ అని గ్రహించలేము. ఆ నోట్ల మీద 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా`, 'ఫుల్ ఆఫ్ ఫన్` అని రాసుండడం గమనించి ప్రజలు షాకయ్యారు. అనంతరం ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇస్తున్నామని, సుదీర్ఘ విరామం తర్వాత బ్యాంకులు తెరుచుకోగానే గురువారం నుంచి విచారణ ప్రారంభిస్తామని పోలీసులు చెప్పారు.