Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ వర్గం పై విద్వేష వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యి జైలులో ఉన్న గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు భారీ షాక్ తగిలింది. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ కమిటీ సమర్థించింది.
ఓ మతాన్ని కించపరిచేలా రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే అతనిపై పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. దాంతో రాజాసింగ్ పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ అడ్వైజరీ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, అకారణంగా తనపై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన కమిటీని కోరారు. అయితే రాజా సింగ్ అభ్యర్థనను కమిటీ కొట్టివేసింది. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను సమర్థించింది. రాజాసింగ్‌పై 101కేసులు ఉన్నాయని.. అందులో 18 కేసులు కమ్యూనల్ కు సంబంధించినవి కావడంతో పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పీడీ యాక్ ట్ను రీవోక్ చేయాలని హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ ఈ నెల 28న విచారణకు రానుంది.