Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని టీఆర్ఎస్ నేత వినోద్ ఆరోపించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ కుట్రలు చేస్తోందని.. అందులో భాగంగానే తమిళి సై గవర్నర్ గా కాకుండా బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందుకే గవర్నర్ బిల్లులకు ఆమోదం పలకకుండా పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. బీజేపీ తల్లక్రిందులుగా తపస్సు చేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సేనని అన్నారు.బీజేపీ చేసే కుట్రలు పెట్టే ఇబ్బందుల్ని మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని అందుకే టీఆర్ఎస్ కే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను పరిశీలించి త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని.. బిల్లుల ఆమోదం అనేది పూర్తిగా తన పరిధిలోని అంశమని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.